Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని తెలిపారు. ఇక, పౌర సరఫరాల, ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యాయి. కాకినాడలో తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Read Also: ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
ఇక, తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు వీరే..
శ్రీకాకుళం- చక్రధర్ బాబు
విజయనగరం- రవి సుభాష్.
మన్యం- నారాయణ భరత్ గుప్తా
విశాఖపట్నం- అజయ్ జైన్
తూర్పుగోదావరి- కన్నబాబు
కాకినాడ- కృష్ణ తేజ
కోనసీమ- విజయరామరాజు
పశ్చిమ గోదావరి- ప్రసన్న వెంకటేష్
ఏలూరు- కాంతి లాల్ దండే..
కృష్ణ- ఆమ్రపాలి
ఎన్టీఆర్- శశిభూషణ్
గుంటూరు- ఆర్పీ సిసోడియా
బాపట్ల- వేణు గోపాల్ రెడ్డి
ప్రకాశం- కోన శశిధర్..
నెల్లూరు- యువరాజ్.
తిరుపతి- అరుణ్ బాబు
చిత్తూరు- గిరీషా
