NTV Telugu Site icon

YSRCP Leaders: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!

Guntur Stampede

Guntur Stampede

Guntur Stampede: టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గత నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కు చేరిన తెలిసిందే కాగా.. తాజాగా, గుంటూరులో అదే సీన్‌ రిపీట్ అయ్యింది. గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే, చంద్రబాబు సభ ముగిసిన తర్వాత తొక్కిసలాట జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టగా.. చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్‌ జగన్.. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.. మరోవైపు.. గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు హోంమంత్రి తానేటి వనిత.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోం మినిస్టర్.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.. ఇక, తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు

అయితే, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 30 మందిని పోట్టనపెట్టుకున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంక్రాంతి కానుకను జగన్ ప్రభుత్వం తొలగించిందని చెప్పడానికే చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతి కానుకల కార్యక్రమం నిర్వహించారు.. ప్రజలను చంపి చంద్రబాబు సాధించేది ఎమిటి? అని నిలదారు. వారి కుటుంబాలకు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబులో మార్పు రావాలని ఆ దేవుడిని ప్రార్థించినట్టు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వ్యాఖ్యానించారు వెల్లంపల్లి శ్రీనివాస్‌. మరోవైపు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సభలలో ప్రజలను బలికోనడం బాధాకరం అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.. వైఎస్‌ జగన్‌ సుధీర్ఘ పాదయాత్ర చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్న ఆమె.. నిన్నటి ఘటనలో భాధితులుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.. ఇక, చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అరిష్టమేనని మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం.. గతంలో పుష్కరాలు.. ఇప్పుడు సభలు అప్పుడు ప్రజలు చనిపోతున్నారు.. అందుకే చంద్రబాబుని ప్రజలు ఆదరించడం లేదన్నారు మంత్రి జయరాం..

Show comments