ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు వ్యవహారంపై వివాదం కొనసాగుతూనే ఉంది… పాలక, ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి… అయితే, అసలు ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె… వైఎస్ఆర్ సేవలను భావితరాలకు తెలియచేసేందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేశాం అన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉంది… అందుకే కొత్త జిల్లాకు ఎన్టీఅర్ పేరు పెట్టారని ఆమె గుర్తుచేశారు.. ఇక, చంద్రబాబు మెడికల్ కాలేజీలపై ఏదేదో మాట్లాడుతున్నాడు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఎయిమ్స్ ఏర్పాటుపై చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించిన ఆమె.. విభజనచట్టం ప్రకారం ఎయిమ్స్ ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించారన్నారు. నెల్లూరు మెడికల్ కాలేజీ 2007-08లో అప్పటి సీఎం వైఎస్సార్ చొరవతో వచ్చిందన్న ఆమె.. రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నెల్లూరు కాలేజీ తెచ్చినట్లా…? అని ప్రశ్నించారు.
Read Also: Somu Veerraju: అభివృద్ధిలో మోడీ హీరో.. జగన్ జీరో…!
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేందుకు సీఎం జగన్ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారని తెలిపారు మంత్రి రజిని.. చంద్రబాబు మాటలు చూసి అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేసిన ఆమె.. పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజీ కూడా వైఎస్సార్ కృషితోనే ఏర్పాటయ్యింది.. చంద్రబాబు హయాంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నించారు. సిద్దార్ద మెడికల్ కాలేజీ ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేశారు.. కానీ, కాలేజీల విషయంలో చంద్రబాబు మాటలతో నవ్వులపాలవుతున్నారని సెటైర్లు వేశారు.. 18 మెడికల్ కాలేజీలు ఉంటే 13 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు… ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించారే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచించలేదని మండిపడ్డారు.. ఇక, వైద్యరంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టాం.. ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ అనుమతిచ్చారు.. ఇందుకోసం ఏడువేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారని తిలిపారు.. నాడు వైఎస్సార్ రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే.. సీఎం జగన్ మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారని.. ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రశంసలు కురిపించారు.
3,820 కోట్లు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు మంత్రి విడదల రజిని.. వైఎస్ఆర్ సేవలను భావితరాలకు తెలియచేసేందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేశామని స్పష్టం చేశారు.. ఇక, బీసీల ద్రోహి చంద్రబాబు అంటూ ఫైర్ అయిన ఆమె.. బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకొని వదిలేశారని ఆరోపించారు.. బీసీలకు న్యాయం చేసింది సీఎం వైఎస్ జగనే.. కేబినెట్‌లో పదకొండు మంది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారని అభినందించారు. బీసీల కోసం చంద్రబాబు ఏదైనా ఒక్క పథకం తీసుకొచ్చారా..? అంటూ మండిపడ్డారు మంత్రి విడదల రజిని.
