NTV Telugu Site icon

Dadisetti Raja: పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది..!

Dadisetti Raja

Dadisetti Raja

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఆరోపణలు గుప్పించారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా… మా వ్యూహాలు మాకు ఉంటాయి.. ఎప్పటికప్పుడూ అవి మారుతూ ఉంటాయి.. మొత్తంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పనిచేస్తామంటూ పవన్‌ కల్యాణ్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యింది అంటూ విమర్శలు గుప్పించారు.. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాడిశెట్టి.. అది జనసేన కాదు.. “నారా-నాదెండ్ల” సేన అంటూ సెటైర్లు వేశారు. రాజకీయం అంటే సొంత కళ్యాణం కాదు… లోక కళ్యాణం అన్న ఆయన.. పవన్ కు ఉన్నది బాబు, కావాల్సింది ప్యాకేజీ అంటూ సెటైర్లు వేశారు.

Read Also: Pawan Kalyan New Plan: కేసీఆర్‌ లాంటి వ్యూహం సిద్ధం చేసిన పవన్‌ కల్యాణ్.. టార్గెట్‌ ఎవరు..?

ఇక, పవన్‌ కల్యాణ్‌కు మంగళగిరిలో వేరే ఆఫీసు ఎందుకు, టీడీపీ ఆఫీసు ఉండగా..? అని ఎద్దేవా చేశారు దాడిశెట్టి రాజా… రాజకీయ కరువు బాధితుడు పవన్ కు స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు అందాయని ఆరోపణలు గుప్పించిన ఆయన.. టీడీపీ ప్రభుత్వంలో దుష్టచతుష్టయం-పవన్ ల కడుపు నిండింది.. జనం కడుపు ఎండింది అన్నారు.. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే.. జుట్టు పెంచుతున్నాడు అని సెటైర్లు వేశారు.. ప్రతి నమస్కారంతోపాటు ప్రతి ఒక్కరికీ మంచి చేసే సంస్కారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంతం అన్నారు.. ఇంతకీ.. నిన్ను చిరంజీవికి తమ్ముడు అనాలా.. చంద్రబాబుకు దత్తపుత్రుడు అనాలా? అంటూ పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు మంత్రి దాడి శెట్టి రాజా.