Site icon NTV Telugu

AP Capital: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: హోంమంత్రి మేకతోటి సుచరిత

అమరావతిలోనే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంట్ సభను శుక్రవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని ఆమె స్పష్టంచేశారు. రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని కేంద్రం చెప్పిందని సుచరిత పేర్కొన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని పేర్కొన్న ఆమె కోర్టు అభిప్రాయంపై పెదవి విరిచారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని చెప్పే వారికి అవగాహన లేదని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని, తాము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని మేకతోటి సుచరిత వెల్లడించారు.

Exit mobile version