High Court: బిగ్ బ్రేకింగ్.. జీవో నంబర్1ని సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ ప్రతిక్షాలు మండిపడుతున్నాయి.. అయితే, జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ నెల 23వ తేదీ వరకు జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జీవో నంబర్ 1ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, జీవో నంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. దీనిపై ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది..
Read Also: G20 Preparatory Conference in Vizag: విశాఖను అందంగా తీర్చిదిద్దాలి.. సీఎం జగన్ ఆదేశాలు
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
కాగా, రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ జీవో తెచ్చారని ఆరోపిస్తున్నారు.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.. తమ సభలకు వస్తోన్న జనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్బంధాలకు తెరతీశారని ఆరోపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగా మారింది.. మరి ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసే కౌంటర్‌లో ఎలాంటి విషయాలను వివరిస్తుంది.. హైకోర్టు ఎలా స్పందిస్తింది.. ఇంతకి జీవో నంబర్ వన్ కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..