Site icon NTV Telugu

CM Chandrababu: దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్టులోకి దుసుకొచ్చిన ఏపీ

Ap Grow

Ap Grow

CM Chandrababu: దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్ లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది.. 2024-25 సంవత్సరానికి గ్రోత్ రేట్ లో రెండవ స్ధానంలోకి ఏపీ.. కాన్ స్టెంట్ ప్రైసెస్ లో 8.21 శాతం గ్రోత్ రేట్ తో దేశంలో రెండో స్థానంలో ఏపీ.. 9.69 శాతం గ్రోత్ రేట్ తో దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ను నిర్థారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది.

Read Also: Hyderabad: నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం.. సీపీ కీలక సూచనలు

ఇక, ఏడాది కాలంలో 2.02 శాతం పెరిగి 8.21 శాతంగా నమోదు అయింది. కరెంట్ ప్రైసెస్ విభాగంలో 12.02 శాతంగా ఎపి గ్రోత్ రేట్.. ఏపీ వృద్దిరేటు దేశంలో రెండో స్థానానికి చేరడంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పడడంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా వృద్ది రేటు సాధించామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంథన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. గ్రోత్ రేట్ వృద్ది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Exit mobile version