ఉపాధ్యాయుల విధుల విషయంలో కీలక సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది.. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మంత్రుల సంతకాలు కూడా పూర్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విధుల సవరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్..
Read Also: Vemula Prashanth Reddy: వైఎస్‌పై సంచలన వ్యాఖ్యలు.. వందలాది మంది మృతికి ఆయనే కారణం..
కొత్త సవరణల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లభించింది.. అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు.. దీంతో, వాటిపై ఫోకస్ పెట్టిన సర్కార్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సవరణ చేస్తున్నట్టు పేర్కొంది.. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం రూల్స్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉపాధ్యాయులు అకడమిక్ ఆచివ్‌మెంట్ లెవెల్ పెంచేందుకు మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.. ఉపాధ్యాయులకు బోధనేతర, విద్యేతర బాధ్యతలేవి అప్పగించకూడదని నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు నియమించగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బోధనేతర విధులను అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
