Site icon NTV Telugu

Andhra Pradesh: మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న మంగళవారం నాడు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాజువల్‌ లీవ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సీఎం జగన్‌ పెద్ద పీట వేస్తున్నారని రోజా అభిప్రాయపడ్డారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే.

https://ntvtelugu.com/new-ticket-rates-go-released-ap-government/
Exit mobile version