NTV Telugu Site icon

Farmers’ debts: రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు.. కేంద్రం ప్రకటన..

Farmers

Farmers

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే ఏపీ అప్పు మూడు రెట్లు, తెలంగాణ అప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు..

Read Also: Pathan Movie Controversy: ‘పఠాన్’కు వివాదంలోకి ప్రముఖ సింగర్.. జనాలు సెన్సిటివ్ గా మారారని వ్యాఖ్య

జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబంపై రూ.74,121 కోట్ల రుణభారం ఉందని తెలిపారు నరేంద్రసింగ్‌ తోమర్.. ఏపీలో ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉంటే.. తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై రూ.1,52,113 మేర రుణభారం ఉందన్నారు.. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ.10,218తో పోలిస్తే ఏపీ రైతు కుటుంబాల ఆదాయం (రూ.10,480) 2.56%మేర ఎక్కువగా ఉందని.. అప్పు మాత్రం దాదాపు మూడురెట్లు అధికంగా ఉందని చెప్పారు.. ఇక, తెలంగాణ రైతుల మీద కూడా జాతీయ సగటుకంటే రెండురెట్ల అప్పు ఎక్కువగా ఉండగా.. ఇదే సమయంలో అక్కడి రైతుల నెలవారీ ఆదాయం రూ.9,403కే పరిమితం అయ్యింది.. ఇది జాతీయ సగటు ఆదాయం (రూ.10,480) కంటే 7.9% తక్కువగా ఉందని పేర్కొన్నారు..

కేంద్ర ప్రభుత్వం 2008-09లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం అమలు చేసిందని, ఆ తర్వాత కేంద్రం మళ్లీ ఎప్పుడూ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. అయితే రైతులపై రుణభారాన్ని తగ్గించేందుకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఏటా రూ.6 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబంపై సగటున రూ.లక్షకుపైగా రుణభారం ఉన్న రాష్ట్రాలు 8 ఉండగా, అందులో దక్షిణాది నుంచి నాలుగు రాష్ట్రాలున్నాయి. అందులోనూ మిగతా రాష్ట్రాలకంటే తెలుగు రాష్ట్రాల్లోని రైతుల కుటుంబాల ఆదాయం అతితక్కువగా ఉంది. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకొనే ఈశాన్యరాష్ట్రాల్లో సగటు రైతు కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.16,863, సగటు రుణభారం రూ.13,642 ఉండగా, తెలుగురాష్ట్రాలు రెండు విషయాల్లోనూ వాటికంటే వెనుకబడి ఉన్నాయి. తలసరి అప్పుల భారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పులు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.74,121 కోట్ల అప్పు ఉండగా, ఏపీ రైతులపై మూడింతలు భారం ఉంది. తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబానికి రూ.1,52,113 అప్పు ఉంది. అప్పుల పాలైన రాష్ట్రంగా 5వ స్థానంలో ఉంది.

మరోవైపు.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ)లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి. ఈ తొమ్మిది నెలల్లో దేశంలోకి 42,509 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రాగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు 217 మిలియన్ డాలర్లు (0.51%) మాత్రమే వచ్చాయి. తెలంగాణకు 1287 మిలియన్ డాలర్లు (3.02%) వచ్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Show comments