NTV Telugu Site icon

ద‌య‌చేసి స‌మ్మె విర‌మించండి.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కారం

పీఆర్సీ విష‌యంలో ఆందోళ‌న బాట‌ప‌ట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.. అయితే, స‌మ్మె విర‌మించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగుల‌ను కోరారు సీఎస్‌ సమీర్‌ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామ‌న్న ఆయ‌న‌.. అస‌లు సమ్మె చేస్తే ఏమి వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ లాంటిది.. దాన్ని సర్దుబాటు చేసుకోవాల‌ని సూచించిన ఆయ‌న‌.. తెలంగాణ తరహాలో డీఏలిచ్చి ఐఆర్ ఇవ్వకుంటే ఏపీకి రూ. 10 వేల కోట్లు మిగిలేద‌న్నారు.. కానీ, సీఎం జగన్ ఐఆర్ ఇవ్వాల్సిందేనన్నారు.. పే-స్లిప్పులన్నీ చూస్తే ఓవరాలుగా గ్రాస్ శాలరీ పెరిగింద‌ని వివ‌రించారు.

సమ్మె నోటీసును విరమించండి.. చర్చలకు రండి అంటూ మ‌రోసారి ఉద్యోగా సంఘాల‌ను ఆహ్వానించారు సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. మ‌రోవైపు.. ఐఆర్ జీతంలో భాగం కాదు.. పాత-కొత్త పీఆర్సీల మధ్యలో ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక వెసులుబాటు మాత్రమే అన్నారు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్… ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం మేర 30 నెలల పాటు ఇవ్వడం వల్ల రూ. 17918 కోట్లు ప్రభుత్వంపై భారం పడింద‌ని వివ‌రించారు.. ఐఆర్ అడ్జస్టుమెంటుపై జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కీలక వ్యాఖ్యలు.. ఐఆర్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కో తరహా పదాన్ని వాడతారు.. ప్రభుత్వం సర్దుబాటు అంటుంది.. సామాన్యులు రికవరీ అంటారు.. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగికే డబ్బులు రావాల్సి ఉంటే ఎరియర్స్ అంటారు.. అదే ఉద్యోగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే నెగెటీవ్ ఎరియర్స్ అంటార‌ని వెల్ల‌డించారు.