ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి.. ఇదే సమయంలో టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గిపోయింది.. గత బులెటిన్‌లో 5,983 పాజిటివ్ కేసుల నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య భారీగా తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,578 శాంపిల్స్ పరీక్షించగా.. 4,605 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 10 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. అనంతపురం, కడప, కర్నూలులో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో 11,729 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
Read Also: ఛలో విజయవాడ సక్సెస్.. జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు..!
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,25,71,365కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,93,171కి, రికవరీ కేసుల సంఖ్య 21,85,042కు, మృతుల సంఖ్య 14,641కి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,488గా ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. మరోవైపు తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 642, పశ్‌చిమ గోదావరిలో 539, గుంటూరులో 524, నెల్లూరులో 501 కేసులు నమోదు అయ్యాయి.