వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏలూరు జిల్లా వేలేరుపాడులో బాధితులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వరద బాధితులకు సహాయం అందించడానికి గతంలో ఎప్పుడు లేని విధంగా చర్యలు తీసుకున్నాం.. ముంపు గ్రామాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించడానికి చర్యలు వేగవంతం చేస్తాం అన్నారు.. పరిహారం అందనివారికి మరింత గడువు ఇచ్చి పూర్తి పరిహారం ఇస్తామని స్పష్టం చేసిన ఆయన.. ముంపు గ్రామాలను తరలించేందుకు వారికి త్వరగా పరిహారం అందించేందుకు కృషి చేస్తాం అన్నారు. పరిహారం చెల్లించేందుకు 20వేల కోట్లు అవసరం వుంది.. దీనికి కేంద్రం నుంచి సహకారం అవసరం అన్నారు సీఎం జగన్.. కేంద్రం నుంచి మనకి రావాల్సిన బకాయిలు చాలా వున్నాయి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో చలనం ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిహారం అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also: World Record Doctor: ఒక్క రూపాయి వైద్యుడిగా వరల్డ్ రికార్డు సృష్టించి.. నిన్న ఈ లోకాన్నే వదిలి..
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరామని తెలిపారు సీఎం వైఎస్ జగన్… గోదావరి ముంపు ప్రాంతాల్లో నేను పర్యటించా.. ప్రత్యక్షంగా వారి పరిస్థితిని చూసి వచ్చా.. పోలవరం నిర్వాసితులంతా మిమ్మల్నే తిట్టుకుంటున్నారు అని చెబుతానన్న ఆయన… పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.. వరద ప్రభావిత ప్రాంతాలకు సాయంపై గట్టిగా అడుగుతా.. మీకు పరిహారం ఇస్తేనే ప్రాజెక్టులో నీళ్లు నింపుతానని స్పష్టం చేశారు.. 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే వారికి సెప్టెంబర్ నాటికి పరిహారం ఇస్తామని.. పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.. నిర్వాసితులకు గతంలో ఎకరాకు ఇచ్చిన లక్షా.. లక్షా పదిహేను వేల పరిహారాన్ని అదనంగా కలిపి మొత్తం 5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. వరదల వల్ల నష్టపోయిన ఏపీకి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరతాం.. దానికి రూ. 20 వేల కోట్లు అవసరం అన్నారు.. ఏ 5 వేల కోట్లో.. 10 వేల కోట్లు అయితే మనం చేయగలం.. కానీ, వదర బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..