NTV Telugu Site icon

CM YS Jagan: మైల’వరం’పై జగన్‌ ఫోకస్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు..

Ys Jagan

Ys Jagan

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మైలవరం పంచాయితీ హాట్‌టాపిక్‌గా సాగుతూ వచ్చింది.. చివరకు అది సీఎం వైఎస్‌ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్‌, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తూనే ఉంది.. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.. ఇప్పటికే వైసీపీ అధిష్టానం వారిని సముదాయించే ప్రయత్నాలు చేసింది.. ఇక, పార్టీ అధినేత, సీఎం జగన్‌ వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో.. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికల దిశగా సన్నద్ధం చేస్తూనే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పలు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇక, ఇవాళ మైలవరం వంతు వచ్చింది. మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సీఎం జగన్‌.. కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Delivery In Plane Washroom : ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే బిడ్డకి విమానంలో జన్మనిచ్చిన మహిళ

గడప గడప కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి నాలుగు నెలలు పైనే అయ్యింది.. మైలవరం నియోజకవర్గంలో 89 శాతం ఇళ్లకు సంక్షేమం అందించామని తెలిపారు సీఎం జగన్.. ఈ మూడున్నర ఏళ్ళల్లో మైలవరం నియోజకవర్గంలో 900 కోట్లకు పైగా లబ్ది జరిగిందన్న ఆయన.. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లే అడుగులు వేగంగా వేస్తున్నాం.. ఇళ్ల దగ్గరకు వెళ్లే సరికే వారి ఆధార్ కార్డ్ నెంబర్ తో సహా చెప్పగలుగుతున్నాం.. ఇంత మేలు చేయగలిగాం అని దైర్యంగా చెప్పగలుగుతున్నామన్నారు.. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆశ్వీరిందించండి అని అడుగ గలుగుతున్నాం.. ఇతర కారణాలతో సంక్షేమం అందని వారికి కూడా గడప గడప ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని వెల్లడించారు. ఇక, జనవరి నుంచి బూత్ కమిటీల నియామకం చేపట్టనున్నట్టు తెలిపారు.. బూత్ కమిటీలో ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటున్నాం.. ముగ్గురు సభ్యుల్లో కచ్చితంగా ఒక మహిళ కూడా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం.. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, ఒక తమ్ముడు గృహ సారధులను నియమిస్తున్నామని ప్రకటించారు.

ఇక, గృహ సారధులు, సచివాలయ కమిటీ కన్వీనర్లు రానున్న 16 నెలలు ఇంటింటికి వెళ్లాలి.. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలి.. ప్రతి పథకం అందుతుందా లేదా అన్నది పరిశీలించాలని అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. అందరూ కలిసి నిజమైన లబ్దిదారులకు ప్రతి పథకం అందేలా చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఈ కార్యక్రమం జనవరి నుంచి మరింత వేగవంతంగా జరగాలని స్పష్టం చేశారు.. ఈసారి మన టార్గెట్ 175 నియోజకవర్గాలు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం.. అది నాఒక్కడితో సాధ్యం కాదు.. మనం అందరం కలిస్తేనే టార్గెట్‌ పూర్తి చేయగలం అని పిలుపునిచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, మైలవరంలో నేతల మధ్య వార్‌, గ్రూపుల తలనొప్పిగా మారడంతో.. గ్రౌండ్‌ లెవల్‌లో.. కార్యకర్తల పరిస్థితి ఏంటి? అనే దానిపై సీఎం జగన్‌ ప్రత్యేకంగా ఫోకస్‌పెట్టినట్టు తెలుస్తోంది.