NTV Telugu Site icon

AP CM: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Babu

Babu

AP CM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ( బుధవారం) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్తు్న్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే ఛాన్స్ ఉంది. ఇక, వారితో భేటీలో రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన నిధుల విషయంలో వారితో చర్చిస్తారని సమాచారం.

Read Also: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!

ఇక, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోవడంతో.. దీనిని గాడిన పడేయాలంటే కేంద్ర సర్కార్ నుంచి సహకారం అవసరం అని భావించిన సీఎం చంద్రబాబు.. అనేక విషయాల్లో మోడీ సర్కార్ నుంచి నిధులను తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరేందుకే చంద్రబాబు ఈ టూర్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఐదేళ్లలో రెండు ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాం.. దానికి కావాల్సిన నిధుల కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.

Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ.. విషయం ఏంటంటే..

అయితే, త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఏన్డీయే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభావం పని చేసిందని ప్రజలు భావించే ఛాన్స్ ఉందనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. కేంద్రం ఈసారి బడ్జెట్ లో పోలవరం, అమరావతిలకి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని కూడా సూచించనున్నారు.