Site icon NTV Telugu

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజే వాడీవేడీ చర్చ..!

Ap Assembly Session

Ap Assembly Session

ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి… ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు.. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతుంది.. మృతిచెందిన ప్రజాప్రతినిధులకు సంతాప తీర్మాణాలు ప్రవేశపెట్టనున్నారు స్పీకర్‌.. ఇక, మూడు రాజధానులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది… మరోవైపు పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ సాగనుంది.. అయితే, మొదటి రోజే మూడు రాజధానులపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న నేపథ్యంలో.. తొలి రోజు నుంచే ఏపీ ఉభయ సభల్లో వాడీవేడీ చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల పని దినాలు, అజెండా ఖరారు చేయనున్నారు.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

మూడు రాజధానులపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ సాగనుంది.. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.. అయితే, మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ సవాల్‌ చేసింది… వికేంద్రీకరణతోనే అభివృద్ధి అంటోంది ప్రభుత్వం.. ఉభయ సభల్లో జరిగే ప్రశ్నోత్తరాల్లో కీలక అంశాలపై చర్చ సాగనుంది.. మరోవైపు.. ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చిచింది తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్.. యువతను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలుగు యవత, టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనకు దిగనున్నాయి.

ఇక, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే..
* ఆర్బీకేలు, ఖరీఫ్‌ పంటనష్ట పరిహరం, ఎస్సీ విద్యార్థుల స్టడీ సర్కిళ్లు.

* ప్రమాదకర స్థితిలో శ్రీశైలం ప్రాజెక్టు, గిరిజన సహకార సంఘాలు, రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు.

* రజకులు-దర్జీలు-నాయీ బ్రహ్మాణులకు ఆర్థిక సాయం, పీఎంజీఎస్‌వై బిల్లుల చెల్లింపు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, విదేశీ విద్యా దీవెన పథకం.

మండలిలో ప్రశ్నోత్తరాలు:
* పారిశ్రామిక హబ్‌లు, నిత్యావసరాల ధరలు, ఓడరేవులు, ఫిషింగ్‌ హర్బర్లు,

* ఆరోగ్య శ్రీ బిల్లులు, నరేగా పనుల పురోగతి, గండికోట నిర్వాసితుల ఆర్‌ అండ్‌ ఆర్‌.

* డప్పు కళాకారులు, చర్మకారులకు ఫించన్లు, భూముల మార్పిడి

* వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ, మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు

Exit mobile version