Kethireddy Pedda Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట లభించినట్టు అయ్యింది.. పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.. అయితే, తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాదులు సిద్ధార్థ దవే, పి .సుధాకర్ రెడ్డి , అల్లంకి రమేష్.. అయితే, నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచించింది.. ఇదే సమయంలో తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఇక, పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు అంగీకరించారు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు..
Read Also: Samsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G రిలీజ్
