Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రెండు రోజులు పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రేపు ( డిసెంబర్ 11న) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్ర చేరారు. ఇవాళ మరో ఇద్దరు వైఎస్సాఆర్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: Indigo Auto: ఇండిగో విమానాల రద్ధుతో.. ఇండిగో ఆటో నడిపిన నెటిజన్
అయితే, కళ్యాణదుర్గం వైసీపీ ఇంఛార్జీ తలారి రంగయ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కళ్యాణదుర్గంలో ఆనంద్ అనే యువకుడి మృతిని.. పరువు హత్యగా ఆరోపించడంతో.. పరువు హత్యకు గల ఆధారాలు చూపాలని గతంలో తలారి రంగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తలారి రంగయ్య ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆధారాలు ఇవ్వకుండా తలారి రంగయ్య తప్పించుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆరోపణలు చేశారు. హత్య చేశారని ఆరోపించడం కాదు.. ఆధారాలు చూపించమంటే తప్పించుకు తిరగటం.. తలార్ రంగయ్య నైజం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.