JC Prabhakar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి.. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి.. మీరు ఇలా ఉన్నారంటూ హెచ్చరించారు.. వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. అంటే.. ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మాట్లాడేటప్పుడు ఒక సారి ఆలోచించి మాట్లాడండి అని హితవు చెప్పారు.. నీకు భవిష్యత్తు చాలా వుంది దానిని నాశనం చేసుకోకు అని సూచించారు.. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మంచి వాడు కాబట్టే.. మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు జేసీ.
Read Also: Tamil Nadu Rain: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేను మూడేళ్లే ఉంటానని పెద్దారెడ్డి చెబుతున్నాడు.. దేవుని ఆశిస్సులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్న ఆయన.. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నవాడు.. ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి.. మళ్లీ అవకాశం ఉండొచ్చు.. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని పేర్కొన్నారు.. మరోవైపు, అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఏమైంది..? దానిపై గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.. సెంట్రల్ రైలు సర్వీసులు ప్రైవేటీకరణ చేయలేదా..? ప్రభుత్వం ఎన్నో సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదా? అని ప్రశ్నించారు.. అసలు, వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారు..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు జేసీ.. చివరకు నేను కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నానని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి..