Site icon NTV Telugu

JC Prabhakar Reddy: దమ్ముంటే రా.. తేల్చుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్‌

Jc

Jc

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్సెస్‌ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయం కాకరేపుతోంది.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం అంటూ సవాల్‌ విసిరారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీపై స్పందించిన జేసీ… కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు.. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.. హైకోర్టు ఆర్డర్ ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావచ్చు అన్నారు.. అయితే, గతంలో టిడిపి నాయకులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నా… కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదు? ఎందుకు అని నిలదీశారు.. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు… ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలని సలహా ఇచ్చారు..

Read Also: Rao Bahadur: ‘రావు బహదూర్‌’.. టీజర్‌ రిలీజ్‌

అయితే, పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దు అని సూచించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాకు ఆ రోజు గన్‌మెన్లు లేరు.. ఈరోజు కూడా గన్‌మెన్లు లేరన్న ఆయన.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం… ఏకే 47లతో గన్‌మెన్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.. కాగా, హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కానీ, నారాయణరెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు.. అయితే, జేసీ వర్సెస్ పెద్దారెడ్డి రాజకీయాలతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి..

Exit mobile version