Site icon NTV Telugu

Jr NTR Fans Protest: అనంతపురంలో హై టెన్షన్.. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Jr Ntr

Jr Ntr

Jr NTR Fans Protest: అనంతపురం జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసం దగ్గర పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ( ఆగస్టు 24న) జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే, ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు.

Read Also: Realme New Phone: రియల్‌మీ నుంచి సరికొత్త ఫోన్.. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్!

ఇక, అనంతపురం నగరంలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వైపు ఎవరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, అనంతపురంలో జరుగుతున్న ధర్నాకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు పామిడి పట్టణ శివారులో అడ్డుకున్నారు. అనంతపురం వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పడంతో పామిడి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

https://www.youtube.com/watch?v=0RVlXG1AuQE

Exit mobile version