NTV Telugu Site icon

Thopudurthi Prakash Reddy: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వివాదస్పద వ్యాఖ్యలు..

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. రాప్తాడులో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్న పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్‌మెన్‌లు కాదని విమర్శించారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వర్గీయులే వైసీపీ కార్యకర్త చాకలి నరసింహులుపై దాడి చేయించారన్నారు. వైసీపీ కార్యకర్తపైనే దాడి చేసి.. తిరిగి వైసీపీ కార్యకర్త నరసింహులు.. టీడీపీ నాయకులపై దాడి చేశారని.. అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆరోపించారు. మరోవైపు పాత కక్షలు నేపథ్యంలో చాకలి నరసింహులుపై దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also: Varanasi : మాఘ పూర్ణిమ వరకు వారణాసిలోకి వాహనాల ప్రవేశం నిషేధం.. కారణం ఇదే

ఇక, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై ప్రకాష్ రెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన సొంత పార్టీ నేతలను బీ టీంగా అభివర్ణిస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సస్పెండ్ చేయించారు.. దీంతో, ఆగ్రహించిన రామగిరికి చెందిన మండల నాయకులు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తామంటూ పోస్ట్ లు పెట్టడం కలకలం రేపింది.