రాప్తాడు సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఆశ చూపించి రైతన్నలను మోసం చేశాడని దుయ్యబట్టారు. గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని డైలాగ్ కొట్టారు. మనం చేస్తున్న అభివృద్ధిని గుర్తు చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
Read Also: Suhani Bhatnagar Death Reason: దంగల్ నటి చనిపోయింది అలా కాదు.. ఆ మహమ్మారే ప్రాణం తీసింది!
57 నెల్లలో కనివినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ పథకాలను ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు చెప్పారు. ఐదేళ్ల కిందట టీడీపీ పాలన, ప్రస్తుత వైసీపీ పాలన గురించి ప్రతి ఇంటికి వివరించాలని కార్యకర్తలకు సీఎం సూచించారు. 125 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో జగన్ మార్క్ కనపడుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఇంత మంచి చేయగలిగామన్నారు. రెండు, మూడు, నాలుగో సారీ గెలిపిస్తే ఎంత మంచి జరుగుతుందో అందరికీ వివరించాలని కోరారు.
Read Also: CM Jagan: ఈ ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోంది..