Site icon NTV Telugu

Anam Ramanarayana Reddy: ఆ భగవంతుని ఆస్తులను రక్షించడమే నా బాధ్యత..

Anam

Anam

Anam Ramanarayana Reddy: ఏపీ సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. బ్లాక్‌-2లోని తన ఛాంబర్‌లో పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను మంత్రి ఆనం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగవంతుని ఆస్తులకు రక్షకునిగా వుండాలని నాకు ఈ బాధ్యత ఇచ్చారు.. గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

Read Also: Uddhav Thackeray: ‘నాకు బీజేపీ రహిత రాముడు కావాలి’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

కాగా, సీఎం చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాగళం, యువగళంలలో వచ్చిన వినతులను పరిష్కరిస్తాం.. రూ. 50 వేల కంటే తక్కువ ఉన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల నిమిత్తం రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించి రూ.32 కోట్లు అదనపు భారం దేవాదాయ శాఖపై పడుతుంది అన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేది లేదు.. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాలలో తప్పులు జరిగినట్టు నిర్ధారించి 5 అధికారులను సస్పెండ్ చేశామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

Read Also: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్‌.. నేడు తులం బంగారం ఎంతుందంటే?

ఇక, దేవదాయ శాఖకు చెందిన ఓ అధికారిణిని సస్పెండ్ చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చాురు. 160 దేవాలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నాం.. 13 వెనుకబడిన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలో ఉన్న గుళ్లనూ పునర్నిర్మాణం చేయాలని ఆదేశించాం.. కృష్ణ , గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగించనున్నామన్నారు.. అలాగే, రేపు కెబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది అని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version