Site icon NTV Telugu

Vangalapudi Anitha: కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్నిన హోంమంత్రి..

Anitha

Anitha

Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసింది. కాడెడ్లతో నాగలి పట్టుకొని మంత్రి అనిత పొలం దున్నింది. అలాగే, రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణి చేసింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 80 శాతం రాయితీపై డ్రోన్ ప్రారంభించింది.

Read Also: PM Modi: మోడీ అపాయింట్‌మెంట్‌పై షరతులు.. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటేనే పర్మిషన్

ఇక, హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతు దేశానికి వెన్నుముక.. రైతులకు ఎన్డీయే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వెల్లడించింది. నేడు డ్రోన్లు ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారు.. 80 శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నాం.. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాను అని మంత్రి అనిత చెప్పుకొచ్చింది.

Exit mobile version