Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం” అనే నినాదంతో స్థానిక ఎన్నికల బరిలోకి వెళ్తామని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ అమ్మకాల చుట్టూనే సాగుతున్నాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, భూములు, చివరకు డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చేందుకే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ తదితరులు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజాభిమానం లేదని, అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరగడం లేదని విమర్శించారు. పోలీసులు, అధికారుల బలంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న ప్రజాభిమానంతో ఎన్నికలను ఎదుర్కొంటుందని అన్నారు.
Also Read
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఇక, అధికారం కోసం పార్టీ మారే అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వకూడదని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. జగన్‌తో జీవితాంతం ఉండే వారికి ఈసారి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి జగన్ కాదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పోరాడే ప్రతి ఒక్కరికి భవిష్యత్‌లో పార్టీ పదవుల్లో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం’ అనే నినాదంతో స్థానిక ఎన్నికల బరిలోకి వెళ్తామని అమర్నాథ్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ అమ్మకాల చుట్టూనే సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, భూములు, చివరకు డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు జీతాలు చెల్లించేందుకే ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారని అమర్నాథ్ ఆరోపించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!