Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం” అనే నినాదంతో స్థానిక ఎన్నికల బరిలోకి వెళ్తామని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ అమ్మకాల చుట్టూనే సాగుతున్నాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, భూములు, చివరకు డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చేందుకే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ తదితరులు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజాభిమానం లేదని, అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరగడం లేదని విమర్శించారు. పోలీసులు, అధికారుల బలంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రజాభిమానంతో ఎన్నికలను ఎదుర్కొంటుందని అన్నారు.

ఇక, అధికారం కోసం పార్టీ మారే అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వకూడదని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. జగన్‌తో జీవితాంతం ఉండే వారికి ఈసారి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి జగన్ కాదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పోరాడే ప్రతి ఒక్కరికి భవిష్యత్‌లో పార్టీ పదవుల్లో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం’ అనే నినాదంతో స్థానిక ఎన్నికల బరిలోకి వెళ్తామని అమర్నాథ్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ అమ్మకాల చుట్టూనే సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, భూములు, చివరకు డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు జీతాలు చెల్లించేందుకే ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెన్సర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారని అమర్నాథ్ ఆరోపించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.