NTV Telugu Site icon

CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు

Chandrababu

Chandrababu

CM Chandrababu: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.. ఇక, నష్ట పరిహారం మొత్తం కంపెనీ భరిస్తుందన్న ఆయన.. యాజమాన్యం ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పోయింది.. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. కానీ, అంత కంటే ముందు భద్రత చాలా అవసరం అన్నారు.. ఐదేళ్లలో 119 ప్రమాదాలు జరిగితే 120 మంది చనిపోయారు.. ఎంఫోర్మెంట్ ఏజెన్సీలు అన్నీ మూకుమ్మడిగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. నివేదికలు అన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి… వాటిని మళ్ళీ ర్యాండం గా ఆడిట్ చేస్తాం.. ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదే అన్నారు.

Read Also: Mobile Salon: అదిరిందయ్యా ఐడియా.. ఒక్క ఫోన్ తో ఇంటి వద్దకే సెలూన్!.. వీడియో వైరల్

రెడ్ జోన్ పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకో మనే పరిస్థితి ఇటీవల రాష్ట్రంలో ఉందన్నారు.. వారసత్వంగా వచ్చిన లేగసి సమస్యనా.. లేక పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనే అనుమానం ఉంది.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు సేఫ్టీ విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలి.. గత ఐదేళ్లు పరిశ్రమలను లూట్ చేశారు.. ఆ కారణం గానే ప్రమాదాలు ఎక్కువయ్యాయి.. వారసత్వంగా వచ్చిన లేగసీ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు.

మాకు 93శాతం స్ట్రయిక్ రేట్ ఇవ్వడం వెనుక ప్రజలు, యువకులకు చాల ఆశలు వున్నాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.. అచ్యుతాపురంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం అన్నారు.. అచ్యుతాపురం ప్రమాదంలో 17 మంది చనిపోయారు. హృదయ విదారకంగా సంఘటనలు జరిగాయి.. అన్నారు.. చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయమని అదేశించామన్నారు.. ఇక, వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగింది… SOP ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. ఇప్పటి వరకు 119 ప్రమాదాలు జరిగే 120మంది చనిపోయారు.. LG పాలిమర్స్ ప్రమాదకర వాయువు.. ఇప్పుడు జరిగింది అధికంగా పేలుడు స్వభావం కలిగింది.. అందుకే భారీ నష్టం జరిగింది… LG పాలి మర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిన కఠిన చర్యలు అమలు చేయలేదని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు..