అనకాపల్లి ఫ్లైఓవర్ ప్రమాదంపై నేషనల్ హైవే అథారిటీకి నిపుణుల కమిటీ నివేదిక చేరింది. ప్రమాదానికి గల కారణాలు,నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ఎక్స్ పార్ట్స్. అయితే గడ్డర్ లను సరిగా కనక్ట్ చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిపుణుల బృందం విచారణ చెప్పటింది. అయితే ఇప్పుడు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంను ఈ నివేదిక బయట పెట్టింది. అన్ని గడ్డర్ లను కలుపుతూ క్రాస్ గడ్డర్స్ వేయాల్సి ఉంది. అవి వేయకుండానే వాహనాలను అనుమతించకూడదు అని పేర్కొన్నారు. ఇక నిర్మాణంలో వాడిన మెటీరియల్ కు సంబంధించి ఎటువంటి లోపం లేదని విచారణ బృందం స్పష్టం చేసింది.