Cheating: రియల్ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వెయ్యడానికి అవసరమైన పెట్టుబడి కోసం బంధువులు, స్నేహితుల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించారు. రియల్ ఎస్టేట్ మందగించడం.. మరోపక్క తెచ్చిన మొత్తానికి వడ్డీలు పెరిగి పోవడంతో డిపాజిట్ దారులకు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
Read Also: UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
వడ్డీ వ్యాపారంలో బంగారు వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో కుటుంబం మొత్తం గైర్హాజర్ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. దీంతో, డిపాజిట్ దారులు తాకట్టు కొట్టు వద్దకు క్యూకట్టారు. అయితే, ఆ షాపుకి రెండు రోజులుగా తాళాలు వేసి ఉండటంతో వీరికి ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.. దీనికి తోడు తాకట్టు కోసం పెట్టిన బంగారం బ్యాంకర్స్ లో ఉన్నాయో లేవోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే హేమంత్ కు రియల్ ఎస్టేట్‌లో పార్టనర్ కూడా హేమంత్ కంటే ముందు నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈవ్యవహారం మొత్తం కోట్లు దాటతాయని తెలుస్తోంది దీనిపై బాధితులు పోలీసులను ఒక్కొక్కరుగా ఆశ్రయిస్తున్నారు . ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.