Banana Farmers: అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో పెరిగే డిమాండ్‌తో లాభాలు ఆర్జించాలని ఎదురు చూసిన అరటి రైతులు ఈ సంవత్సరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూజలు, వ్రతాల కారణంగా ఈ నెలలో అరటి ధరలు పెరుగుతాయని చూసిన అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి. మొంథా తుఫాన్ వల్ల అపారమైన నష్టం వాటిల్లడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, అంబాజీపేట అరటి మార్కెట్‌కు ప్రస్తుతం అరటి గెలలు భారీగా తరలి వస్తున్నాయి. మార్కెట్‌కు అరటి దిగుమతి ఎక్కువగా ఉండటం, కొనుగోలుదారులు లేకకోవడంతో రైతులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు.
Read Also: Jagtial: చదువుకోమని పంపిస్తే ఇవేం పనులు రా..! జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలలో ర్యాగింగ్ కలకలం..
అయితే, అరటి ధరలు పతనం అవ్వడానికి మొంథా తుఫాన్ ప్రధాన కారణం అన్నారు. తుఫాన్ ధాటికి తోటలు నేలమట్టం కావడంతో నాసిరకం గెలలు మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. నాణ్యత తక్కువగా ఉన్న గెలలకు వ్యాపారులు తక్కువ ధరను నిర్ణయించడంతో రైతుల నష్టాన్ని భరించక తప్పడం లేదు.. నాణ్యత లేని కారణంగా కొనుగోలుదారులు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రైతులు తమ బాధను వ్యక్తం చేస్తూ, గత ఏడాది కార్తీక మాసంలో అరటి గెల ధర రూ. 500 పలికింది. కానీ, ఈ సంవత్సరం అదే కర్పూర రకం గెల ధర రూ. 200 కూడా పలకడం లేదన్నారు. కనీస కొనుగోలుదారు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.