Site icon NTV Telugu

AP Crime: పసుపు పారాణి ఆరలేదు.. నవ వధువు దారుణ హత్య..! మృతదేహంతో ఆందోళన..

Crime News

Crime News

AP Crime: పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..

పూర్తి విరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన కుడిపూడి రమ్య సత్యప్రియకు ఆగష్టు 18 వ తేదీన అమలాపురం రూరల్ మండలం వేమవరం- నామాల వారిపాలెంకు చెందిన కొప్పిశెట్టి వెంకటసాయితో వివాహం అయ్యింది. వెంకటసాయి హైదరాబాద్‌ పఠాన్‌చెరులో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి తొత్తరమూడిలో వస్త్ర దుకాణంలో పనిచేసేది. పెళ్లైన తరువాత తొలిసారి అప్పగింతల వరకూ ఇరువురి బంధువుల మధ్య అన్నీ సవ్యంగానే జరిగాయి. ఇక, అమ్మాయి తల్లిదండ్రులు గత నెల 30వ తేదీన చివరి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతానికి పంపమని అబ్బాయిని కోరడంతో లేనిపోని సాకు చెప్పి రాత్రికి రాత్రే హైదరాబాద్ తీసుకువెళ్లిపోయాడని సోదరుడు రమేష్ తెలిపాడు. అక్కడికి వెళ్లినా సోదరి ఫోన్ చేసే వరకూ హైదరాబాద్‌ తీసుకెళ్ళిన సంగతి నాకు తెలియదని చెప్పాడు. అనంతరం వారం రోజులు ఫోన్లో మాట్లాడేదని అ దికూడా అమ్మాయికి ఫోన్ ఇవ్వకుండా వాళ్ల ఫోన్ నుంచే మాట్లాడించే వారన్నారు. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ.. గత మూడు రోజుల నుంచీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని.. తిరిగి నాకు ఫోన్ చేసి ఏమి తెలియనట్లు మీ చెల్లికి ఏమైనా అనారోగ్యం ఉందా అని అడిగారని సోదరుడు రమేష్ చెప్పాడు.. ఇక, ఈ నెల 10 వ తేదీన ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని చెప్పారని కన్నీటి పర్యంతమయ్యాడు. కావాలనే నా చెల్లిని భర్త వెంకట సాయి, ఆడపడుచు కలిపి చంపేసారని రమేష్ ఆరోపిస్తున్నాడు. మృతదేహంతో అమలాపురం మండలం తొత్తరమూడిలోని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నా చెల్లెలు మృతి పట్ల పలు అనుమానాలున్నాయని.. మాకు న్యాయం చేయాలని మృతురాలి సోదరుడు రమేష్ కోరుతున్నారు.

Exit mobile version