కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని జనసేన ఆరోపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ, జనసేన మర్చిపోయినట్లు ఉన్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? రైతుల రూ. 87,600 కోట్ల రుణం మాఫీ చేస్తామని చెప్పి…తీరా చేసింది 15వేల కోట్లు మాత్రమే.
రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా? అని అంబటి ప్రశ్నించారు. అప్పుడు రైతు భరోసా యాత్ర ఎందుకు చేయలేదు పవన్ కళ్యాణ్. చంద్రబాబు రైతులను నట్టేట ముంచటం వల్లే ఇవాళ అక్కడక్కడా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. రైతు భరోసా కింద 50వేలు ఇస్తామని చెప్పి 67వేల రూపాయలు ఐదేళ్ళలో ఇస్తున్నాం. ఇచ్చిన మాట కంటే ఎక్కువగా రైతులకు మేలు చేస్తున్నాం అన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేసిన పాపాలకు చనిపోయిన రైతులకు దండలేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. కౌలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుకు లేదు. మాది రైతు ప్రభుత్వం. మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను చూసి భయపడే పరిస్థితి ఉంటుందా? ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా భయపడే ప్రసక్తే లేదన్నారు.
https://ntvtelugu.com/balineni-srinivasreddy-on-new-cabinet/
ఎవరి పల్లకీనో మోయటానికో జనసేన పార్టీ ఆవిర్భవించింది. 2014లో టీడీపీతో కలిసి పోటీ చేశారు. ఏమైనా సొంతంగా సాధించారా?టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్ అధికారంలోకి రాకుండా ఉండటానికి వేరేగా పోటీ చేశారు. స్వయంగా తానే ఓడిపోయాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పల్లకీ మోయనున్నావో జనసైనికులకు చెప్పాలన్నారు. చంద్రబాబు కాపలాదారుడు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని ఎప్పటికప్పుడు చంద్రబాబు కు సమాచారం ఇస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ అవునంటే కాదని అర్ధం అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.
