Site icon NTV Telugu

Ambati Rambabu: మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం.. ప్రాజెక్ట్‌పై మంత్రి సమీక్ష

Ambati Rambabu Polavaram

Ambati Rambabu Polavaram

Ambati Rambabu Gives Update On Polavaram Project: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అధికారులతో భేటీ అయిన ఆయన.. ప్రాజెక్ట్ పనుల పరోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే ప్రాజెక్ట్‌కి తీవ్ర నష్టం ఏర్పడిందని ఆరోపించారు. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని.. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద అగాధా ఏర్పడ్డాయన్నారు. గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు తేలిందన్నారు.

Uttar Pradesh: యూపీలో దారుణం..ఒకే సిరంజితో చాలా మందికి ఇంజెక్షన్.. అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్..

NHPC, DDRP, PPA బృందాలు అన్ని విధాలుగా పరిశీలన చేసి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించారని అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి.. మిగతా పనుల్లో ముందుకు వెళ్లవచ్చని ఆ బృందాలు సూచించాయన్నారు. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను చేపడతామని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్న ప్రాంతాలను రిపేర్ చేసిన తర్వాత ECRF డ్యాం పనులు మొదలుపెడతామన్నారు. వచ్చే నాలుగు నెలలు చాలా కీలకం కానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. ఈ సీజన్ లో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే రోజు కోసం.. రాష్ట్ర ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్నారని వెల్లడించారు.

Urination Incident: ఎయిరిండియా సీన్ రిపీట్.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జన

మానవ తప్పిదం వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు చాలా నష్టం జరిగిందన్న అంబటి రాంబాబు.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే ఆలోచన చేస్తామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలనే కంగారు లేదని, అతి జాగ్రత్తగా పనులు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Exit mobile version