Ambati Rambabu Counters On Chandrababu Pawan Kalyan: ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌లపై విసుర్లు విసిరారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామ్మోహన్‌రావు జయంతోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరగలేదని.. పోలీసులు, చంద్రబాబు మధ్య జరిగిన గొడవ అని క్లారిటీ ఇచ్చారు. పోలీసులపై చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి అమానుషం అని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన రూట్ మ్యాప్‌లో వెళి ఉంటే.. ఏ సమస్యా ఉండేది కాదన్నారు. కానీ.. అనుమతి లేని చోట చంద్రబాబు రచ్చ చేయాలని చూశారని, కావాలనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేశారని, అందుకే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శాంతి, విపక్షంలో ఉన్నప్పుడు అశాంతి కోరుకుంటున్నారని మంత్రి అంబటి ఆరోపించారు. తాను సింహాన్నని చంద్రబాబు ప్రకటించుకున్నారని.. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది కానీ, నక్క సింహంలా ఎలా మారుతుందో తెలియడం లేదు ఎద్దేవా చేశారు.
Bhumana Karunakar Reddy: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు
ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతూ.. ఆయన బ్రో సినిమా ఫ్లాప్ అయ్యిందన్నారు. ఈ సినిమా తక్కువ కలెక్షన్లు రాబట్టిందన్నారు. తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పలేని వాడు.. రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తాడు? అని ప్రశ్నించారు. తనపై మరో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారన్నారు. అది విడుదలైన తర్వాత తాను కూడా ఓ సినిమా తీస్తానని చెప్పారు. బ్రోలో తనని ఉద్దేశించే ఆ సన్నివేశం తీశారు కాబట్టి, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నానని అన్నారు.
Shilpa Shetty: శిల్పాశెట్టి కంపెనీ ఐపీఓకు వస్తోంది.. పెట్టుబడి పెట్టి సంపాదించుకునేందుకు రెడియా?