Ambati Rambabu Comments On Chandrababu Naidu Manifesto: ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన చిత్రహింసలు, పదవిదాహం వల్ల.. ఎన్టీఆర్ 73 సంవత్సరాలకే గుండె ఆగి చనిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నా అల్లుడు కాదు, ఔరంగజేబు అని ఎన్టీఆరే ఆనాడు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మహానాడు పేరుతో ఎన్టీఆర్‌ని పొగుడుతున్నారని అన్నారు. కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఎన్టీఆర్‌కి భారతరత్న ఎందుకు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అవుతుందని.. వచ్చే ఎన్నికల తర్వాత ఇక ఆ పార్టీ మిగలదని జోస్యం చెప్పారు. సైకిల్ స్క్రాబ్‌గా మారిపోయిందని, తుక్కుతుక్కు అయిన సైకిల్‌ని మళ్ళీ తొక్కాలని తాపత్రయం పడుతున్నారని సెటైర్లు వేశారు. ఆ సైకిల్‌ని కరెంటు శ్మశానంలో తగులపెట్టి.. ఆ బూడిదను లోకేష్, చంద్రబాబు తమ ముఖాలకు రాసుకోవాలని పేర్కొన్నారు.
Chandrababu Naidu: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన చంద్రబాబు
మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపారన్న అంబటి రాంబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి అసలు ఏ మేనిఫెస్టో ఐనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన సంగతి జనం మర్చిపోలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి అప్పుడు కూడా మోసం చేయలేదా? అని నిలదీశారు. ఇవ్వాళ ప్రజల నెత్తిన మళ్ళీ వాగ్ధానాల టోపీ పెట్టారన్నారు. మేనిఫెస్టోని భగవద్గీతగా భావించి గౌరవించిన వ్యక్తి జగన్ అని.. మోసాలతో మభ్యపెట్టే 420 చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. ఈసారి రానున్నది కురుక్షేత్ర యుద్దమేనని.. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పారు. పేదలు లేని వ్యవస్థను సృష్టిస్తానని చంద్రబాబు చెప్తున్నారని.. మరి, 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశావా? అని ప్రశ్నించారు. ఖరీదైన రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాజకీయాలను కూడా వ్యాపారం చేశాడని మండిపడ్డారు.
Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’
కులం పేరు ప్రస్తావన తెస్తే.. మొదటగా చంద్రబాబు, లోకేష్‌లనే చెప్పుతో కొట్టాలని అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో పేదోడికి సెంటు భూమి ఇస్తే.. చంద్రబాబు కడుపుమంటతో అల్లాడిపోయాడని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి పేదలను ధనవంతులను చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? అని అడిగారు. భవిష్యత్తులేని పార్టీ టీడీపీ అని, లోకేష్‌కు రాజకీయ భవిష్యత్తు అసలే లేదని తేల్చి చెప్పారు. ఆయన కోసం ఎంత హడావుడి చేసినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఓ మ్యానిప్యులేటర్ అని.. క్యాష్‌తో ఓట్లను కొనాలని అనుకుంటాడని ఆరోపణలు చేశారు.