NTV Telugu Site icon

Amaravati Arasavalli Yatra: జోరువానలోనూ అమరావతి పాదయాత్ర హోరు

Pada

Pada

అమరావతి నుండి అరసవల్లి.. అమరావతి రైతుల మహా పాదయాత్ర జోరుగా సాగుతోంది. 28 వ రోజు జోరువాన సైతం లెక్క చేయకుండా రైతులు యాత్రలో పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, జిన్నూరు,వేడంగి మీదుగా ఆచంట నియోజకవర్గం చేరుకొంది పాదయాత్ర. ఈసందర్భంగా అమరావతి రైతులకు పువ్వులు, హారతులతో నీరాజనం పలికి రోడ్డుపై మోకరిల్లి స్వాగతం పలికారు మహిళలు.

Read Also: Sister Sacrifice: చెరువులో మునిగిపోయిన చెల్లిని కాపాడి.. అక్క ప్రాణ త్యాగం

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ టీడీపీ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పీతల సుజాత, జవహర్, నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ రావు, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, టీడీపీ నేతలు, జనసేన పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు కవిటం,జగన్నాథ పురం, మార్టేరు, పెనుగొండ వరకు 10 కిలోమీటర్ల  మేర రైతుల  మహాపాదయాత్ర సాగనుంది. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

Read Also: Mulayam Singh Yadav: ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స