NTV Telugu Site icon

Boppararaju Venkateswarlu: సీఎస్ తో బొప్సరాజు భేటీ.. ఉద్యమ కార్యాచరణ వెల్లడి

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu

ఏపీలో తమ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. ఈమేరకు ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చారు జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు నేతృత్వంలోని ప్రతినిధులు. మార్చి 9 నుంచి దశల వారీ ఉద్యమాన్ని ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి నేతలు. ఆర్థికపరమైన, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సెల్ డౌన్ , పెన్ డౌన్, లంచ్ అవర్ ఆందోళనలతో పాటు ఆఖరుగా కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తాం.

Read Also:Naga Shourya: వారితో రోడ్డుపై నాగ శౌర్య రచ్చ.. సారీ చెప్పు ముందు అంటూ

ఆ తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాం. పీఆర్సీ సందర్భంగా ఉద్యోగుల్లో ఉద్యోగ సంఘాల, నేతల పట్ల విశ్వాసం పోయింది.ఉద్యోగుల్లో ద్రోహిగా మిగిలి పోకూడదని ఈ ఉద్యమ కార్యాచరణ చేపట్టాం.ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి.ప్రస్తుతం ఏపీ జెఏసి అమరావతి ఉద్యోగుల సంఘం ఒంటరిగా కార్యాచరణ ప్రకటించింది.తర్వాత అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం.ఈసారి ఛాయ్ బిస్కెట్స్ సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదు.ఉద్యోగులు మమ్మల్ని నమ్మకపోవచ్చు.. కానీ మేం ఉద్యోగ సమస్యలపై పోరాటానికి సిద్దంగా ఉన్నాం అన్నారు బొప్పరాజు.

Read Also: Gold Mines : ఒడిశాలో గోల్డ్.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత