Site icon NTV Telugu

YSRCP: బీజేపీకి మళ్లీ వైసీపీ దగ్గరవుతుందా..?

Ycp

Ycp

YSRCP: ఉపరాష్ట్రపతి ఎన్నికలతో మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించిందా? అనే చర్చ జరుగుతోంది.. ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే ఫుల్ సపోర్ట్ లభిస్తుందా..? కేంద్రానికి మద్దతు అవసరమైన సమయాల్లో అధికార, ప్రతిపక్షాలు రెండూ బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నాయా..? కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర పడాల్సిన సమయంలో కూడా ఏపీ నుంచి బీజేపీ కి రెండు పక్షాల సపోర్ట్ ఇస్తున్నాయా..? గత సార్వత్రిక ఎన్నికల నుంచి బీజేపీకి దూరంగా ఉన్న వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మనసు మార్చుకుని దోస్త్ మేరా దోస్త్ అంటుందా..? తమ పార్టీ అసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అంటూ.. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కేంద్రానికి పలు కీలక బిల్లులకు మద్దతు ఇచ్చిన విషయాలను గుర్తు చేస్తున్నారు.. అంతేకాదు ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో కూడా జగన్ కు తెలుసంటూ ఆ పార్టీ నేతలు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు..

Read Also: TVK rally tragedy: టీవీకే సభలో ఘోరం.. స్పృహతప్పి పడిపోయిన 400 మంది కార్యకర్తలు.. పలువురు మృతి

గత ఎన్నికలకు ముందు బీజేపీతో సత్సంబందాలు నెరిపిన వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో దూరమైంది.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది.. పార్లమెంట్ లో వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది.. వైసీపీ ఆవిర్బావం నుంచి సోలో గానే పోటీ చేస్తూ వస్తున్న వైసీపీ గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడింది.. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంభందాలు కొనసాగించిందో అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్‌ కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది.. దీంతో పాటు తామ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది.. గతంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయేకు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అదే విధంగా పార్లమెంట్‌లో పలు బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. నంబర్‌ గేమ్‌ ఉండొద్దనే ఉద్దేశంతో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు ఆ పార్టీ నేతలు.. గత ప్రభుత్వ హాయాంలో పలు కీలక సందర్బాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ.. వ్యవసాయ చట్టాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా పార్లమెంట్‌లో పలు బిల్లులకు కూడా అధికార బీజేపీ పక్షాన నిలిచింది. వీటితో పాటు డిల్లీ సర్వీస్ బిల్లు, ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమీషన్ నియామక బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు, ఓబీసీ ఎమండ్మెంట్ బిల్లు వంటి పలు కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు ప్కటించింది..

Read Also: Anupama : పక్క స్టేట్లో ఇంత ఫేమస్ అవుతానని, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు!

అంతేకాకుండా 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీకే జగన్ మద్దతు ప్రకటించారు.. వీటితో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడి పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలన్నది వైఎస్ జగన్ ఆలోచనగా ఉంటుందంటారు.. అత్యున్నత పదవులు అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా గెలిపించాలనీ, అప్పుడే దేశ ప్రతిష్ట పెరుగుతుందని జగన్ భావిస్తుంటారని పార్టీ నేతలు చెప్తుంటారు. అందుకే కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్ 2012లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనాటి యూపీఏ కూటమి అభ్యర్ది ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతు ఇచ్చారని గుర్తు చేస్తారు.. ఆ తర్వాత 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాంనాథ్‌ కోవింద్ కి.. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది.. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి.. ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ కి మద్దతుగా ఓటేసింది వైసీపీ.. అయితే ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్.. రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. దీంతో ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంభందాన్ని గుర్తుకు తెచ్చినట్లేనని ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. గతంలో ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వైసీపీ ఈసారి ఏ మేరకు సఫలం అవుతుందనేది చూడాలి మరి.

Exit mobile version