NTV Telugu Site icon

YSRCP: వరద బాధితులకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం.. ఎంతంటే..?

Ycp

Ycp

YSRCP: విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు.. బుడమేరు మరికొన్ని ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది.. మరోవైపు.. వరద బాధితులను ఆదుకోవడానికి అంతా ముందుకు కదులుతున్నారు.. కొందరు డబ్బులు ప్రకటిస్తుంటే.. మరికొందరు నిత్యావసరాలు.. ఫుడ్‌, వాటర్‌, పాలు ఇలా అనేక రకాలుగా సాయం అందిస్తున్నారు.. పలువురు నేతలు కూడా బాధితులను ఆదుకుంటున్నారు.. ఇక, వరద బాధితులకు వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..

Read Also: The Raja Saab: రాజా సాబ్.. అబ్బే అవన్నీ ఫేక్ ముచ్చట్లే మాష్టారూ!

విజయవాడ వరద బాధితుల కోసం వైసీపీ అడుగులు ముందుకేసింది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరూ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. పార్టీ చేపట్టనున్న వరద బాధిత సహాయ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. పార్టీ తరఫున ఇదివరకే కోటి రూపాయల సహాయాన్ని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దాన్ని వినియోగించి వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంకా బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని పార్టీ ప్రకటించింది. ఆ సహాయ కార్యక్రమాలకు తోడు, ఇప్పుడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రటించిన విరాళం అదనం కానుంది. దీంతో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టనున్నారు..

Show comments