Site icon NTV Telugu

Pilli Subhash Chandra Bose: జేపీ నడ్డాకు వైసీపీ ఎంపీ లేఖ..

Mp Pilli Subhash Chandra Bo

Mp Pilli Subhash Chandra Bo

Pilli Subhash Chandra Bose: కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని.. ఏపీకి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా రైతులకు యూరియా అందడం లేదని.. యూరియా అనేక చోట్ల దాచిపెడుతున్నారు అని ఆరోపించారు.. అయితే, పది కోట్ల రూపాయల విలువ చేసే యూరియా నిల్వలను అధికారులు పట్టుకున్నారు .. యూరియా కొరతతో చిన్న, మధ్య తరగతి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కొరత ఏర్పడిన జిల్లాలకు యూరియా పంపాలని లేఖలో జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.. కాకినాడలోని ఎన్ఎఫ్సిఎల్ యూనిట్ను మూసివేత నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు సుభాష్ చంద్రబోస్.. యూరియా స్టాక్ వివరాలను పారదర్శకంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు.. యూరియా కొరత సమస్యను పరిష్కరించకపోతే పంట ఉత్పత్తికి తీవ్ర నష్టం జరుగుతుందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.

Read Also: Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు

Exit mobile version