NTV Telugu Site icon

AP legislative council: మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్‌..

Ysrcp Mlcs Walkout

Ysrcp Mlcs Walkout

AP legislative council: శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్‌ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్. అయితే, ప్రశ్నోత్తరాల సమయంలోనే సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది.. రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందన్నారు హోం మంత్రి అనిత.. కానీ, మహిళలపై దాడులు, హత్యలు, అత్యారాలు పెరిగిపోయాయన్నారు వరుదు కల్యాణి. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించారు కల్పలతా రెడ్డి. అయితే, సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత ప్రభుత్వ పాలనలో అనేక లోపాలున్నాయన్నారు హోం మంత్రి అనిత.. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది.. నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదు. కేంద్రం నిధులిచ్చన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మించలేదు… గంజాయి వినియోగం పెరిగే నేరాలు పెరిగాయంటూ మంత్రి అనిత ఫైర్‌ అయ్యారు..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

దీంతో.. అనిత వ్యాఖ్యలను అడ్డుకున్నారు వైసీపీ సభ్యులు.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వాళ్ళు సభకు వస్తున్నారని దువ్వాడను ఉద్దేశించి మంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు.. సమాధానం వినటానికి దమ్ము ధైర్యం కావాలని పేర్కొన్నారు.. దీంతో, మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత ప్రశ్నకు మళ్లీ సభలోకి వచ్చారు. అయితే, శాసన మండలిలో మరోసారి వైసీపీ వాకౌట్‌ చేసింది.. విద్యుత్ ఛార్జీల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఈ బిల్లు పీడీఎఫ్ వ్యతిరేకించింది.. మరోవైపు.. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి ట్రూ అప్ ఛార్జీల విధించడాన్ని వ్యతిరేకించిన వైసీపీ.. సభ నుంచి మరోసారి వాకౌట్‌ చేసింది.. ఈ నేపథ్యంలో మండలికి టీ విరామం ప్రటించారు చైర్మన్ మోషేను రాజు..

Show comments