Site icon NTV Telugu

Botsa Satyanarayana: బాలకృష్ణ స్పీచ్ చూసిన తర్వాత ఎవరైనా అసెంబ్లీకి వెళ్తారా..?

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: అసెంబ్లీ జరుగుతున్న విధానం, బాలకృష్ణ స్పీచ్ చూసిన తర్వాత ఎవరైనా సభకు వెళ్తారా? అని ప్రశ్నించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ చెప్పలేదన్నారు.. అటువంటి సభకు వెళ్లి మాట్లాడటం కంటే.. ప్రతిపక్షంగా జనం దగ్గరకు వెళ్లి చెప్పడమే కరెక్ట్… మేం అదే చేస్తున్నాం అన్నారు.. ఇక, సభకు రాని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామని చెబుతున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎందుకు ఆ పని చేయడం లేదు..? అని ప్రశ్నించారు బొత్స..

Read Also: POCSO Case: కోర్టు సంచలన తీర్పు.. దంపతులకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..!

ఇక, డేటా సెంటర్ల విషయంలో మా విధానం మొదటి నుంచి క్లియర్ అన్నారు ఎమ్మెల్సీ బొత్స.. రామ్మోహన్ నాయుడుకి భోగాపురం ఎయిర్ పోర్టు అంశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టు దొరికింది.. రోజూ ఎయిర్ పోర్టుకు వెళ్లి పరిశీలించి వస్తున్నట్టు ఫోటోలు వస్తున్నాయి.. అదే మైన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుందా…? అని ప్రశ్నించారు.. ఎయిర్ పోర్ట్ విజిట్ లు తగ్గించి అప్రోచ్ రోడ్లు, 6 లైన్స్ రోడ్స్ నిర్మాణం పూర్తి చేయడంపై దృష్టి సారించండి అని సలహా ఇచ్చారు.. విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చే వాళ్లకు రుషికొండలో హోస్ట్ చేయమని నా సూచన… రుషికొండలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపోవడం అంశం సీజ్ ది షిప్ లాంటిదే అంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ..

Read Also: Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజతో.. వశిష్ట కొత్త ప్రాజెక్ట్!

మరోవైపు, మొంథా తుఫాన్‌ వల్ల జరిగిన పంట నష్టంపై స్పందించిన ఎమ్మెల్సీ బొత్స.. ఇన్సూరెన్స్ లను ప్రభుత్వం చెల్లించి ఉంటే రైతుకు నూటికి నూరు శాతం నష్టం భర్తీ అయ్యేది.. ఈ క్రాప్ విధానం రద్దు చేసి రైతులనే ఇన్సూరెన్స్ కట్టుకో మని వదిలేయడంతో ఎక్కువ మంది నష్టపోతున్నారు అని తెలిపారు.. వైసీపీ హయాంలో రైతుల తరపున ప్రతీ పైసా ఇన్సూరెన్స్ మేం చెల్లించాం.. వైసీపీ హయాంలో 7 వేల కోట్లు మద్దతు ధర రూపంలో చెల్లించాం.. ఈ ప్రభుత్వంలో ఆ విధానం ఎక్కడైనా అమలైందా..? అని ప్రశ్నించారు బొత్స.. ఇక, అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ పై నన్ను అడిగితే సంబంధం లేదనే చెబుతాను.. ఒక వర్గం మీడియా కట్టు కథనాలుగానే భావిస్తున్నాను.. వైజాగ్ డ్రగ్స్ మీద మొదటి నుంచి నా విధానం క్లియర్.. మూడు సార్లు ఈ అంశంపై నేను మాట్లాడాను, సీబీఐకి, హోం శాఖకు లేఖలు కూడా రాశాను.. ప్రభుత్వ వైఫల్యం బయటపడిన ప్రతీసారి డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.

Exit mobile version