Site icon NTV Telugu

YS Jagan: జగన్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించండి.. హైకోర్టులో పిటిషన్

Ap High Court Ys Jagan

Ap High Court Ys Jagan

YS Jagan: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు.. అయితే, ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టింది హైకోర్టు.. మరోవైపు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రతపై రేపు కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. హైకోర్టుకు తెలియజేశారు..

Read Also: Home Minister Vangalapudi Anitha: బాలికల హాస్టల్‌లో హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీలు.. ఊహించని ఘటన..!

మరోవైపు, నెల్లూరులో వైఎస్‌ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అడిగిన చోట కాకుండా వేరే చోట అనుమతి ఇస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ల్యాండింగ్ ప్రాంతం నిర్ణయించినట్టు కోర్టుకు తెలియజేసింది ప్రభుత్వం.. కాగా, వైఎస్‌ జగన్‌, పల్నాడు జిల్లా పర్యటన తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం విదితమే.. జగన్‌ పర్యటనలో ఇద్దరు మృతిచెందడం.. జగన్‌పై కేసులు నమోదు చేయడం.. ఆ తర్వాత ఆయన బుల్లెట్‌ ఫ్రూప్ కారును సీజ్‌ చేయడం జరిగిపోయాయి..

Exit mobile version