NTV Telugu Site icon

AP Secretariat: సచివాలయంలో వైసీపీ కోవర్టులు..! ప్రక్షాళన చేపట్టిన సీఎస్.. వారికి స్థాన చలనం

Ap Cs

Ap Cs

AP Secretariat: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో వివిధ శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్.. అయితే, సచివాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోవర్టులు ఉన్నారని.. ఎప్పటికప్పుడు సచివాలయంలో జరుగుతోన్న పరిణామాలను వైసీపీకి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గత కేబినెట్‌ సమావేశంలోనూ చర్చ సాగింది.. సచివాలయంలో ఉన్న వైసీపీ కోవర్టుల సంగతి చూడాలంటూ కేబినెట్‌ సమావేశంలో సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. దీంతో.. చర్యలకు దిగిన సీఎస్‌.. వివిధ శాఖల్లో ఏఎస్, డీఎస్, జేఎస్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రీ-షఫుల్ చేశారు.. మొత్తంగా 13 మంది సచివాలయ ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది.. ఇక, ఆ 13 మందిలో ఆరుగురిని జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్.

Read Also: SS Rajamouli: సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అంతా సిద్ధం.. రాజమౌళి ట్వీట్ వైరల్!

కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి.. ఇప్పటికీ బదిలీలు కొనసాగుతోన్న విషయం విదితమే కాగా.. సచివాలయంలోనూ ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. కోవర్టులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతోన్న సమయంలో.. ఈ బదిలీలు.. జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి..