NTV Telugu Site icon

YSRCP: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన వైసీపీ.. ఇది అక్రమం

Ycp

Ycp

YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై వైసీపీ స్పందించింది.. వల్లభనేని వంశీని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారని మండిపడింది.. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నారు వంశీ మోహన్‌.. మరోవైపు.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధనే.. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.. కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్‌ చేస్తూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది..

Read Also: Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఎలా దొరికిపోయాడంటే..?

ఇక, రాయదుర్గం పోలీసుల సహకారంతో ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేసిన విజయవాడ పోలీసులు.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో వాహనాన్ని మార్చనున్నారు.. మరోవైపు.. వల్లభనేని అరెస్ట్‌ దృష్ట్యా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఏపీ-తెలంగాణ సరిహద్దులో పోలీసులను మోహరించారు.. కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా మొత్తం ఏడు సెక్షన్ల కింద వల్లభనేనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ వ్యవహారంలోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.. సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.. వంశీపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పడమట పోలీసులు.. పడమట పీఎస్‌లో 86/ 2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. బీఎంఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ త్రి బై 5 సెక్షన్ల కింద.. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 సెక్షన్ 5ల కింద కేసు నమోదు చేసిన విషయం విదితమే..