Site icon NTV Telugu

YSRCP Boycott PAC Elections: పాకిస్థాన్‌లో కూడా ఇలా లేదు.. పీఏసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం..

Peddireddy

Peddireddy

YSRCP Boycott PAC Elections: పీఏసీ చైర్మన్‌ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు పీఏసీ చైర్మన్‌ ఇచ్చారని తెలిపారు పెద్దిరెడ్డి.

Read Also: Ram Gopal Varma: ఆర్జీవీ పిటిషన్లపై విచారణ వాయిదా.. అన్ని కలిపి ఒకేసారి..!

ఇక, పీఏసీ అన్ని తప్పిదాలనూ ఎత్తి చూపుతుంది.. పాకిస్థాన్ సహా అన్ని దేశాల్లో పీఏసీ ప్రతిపక్షానిదే అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గతంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి తెచ్చింది పీఏసీయే అని వెల్లడించారు.. బోఫోర్స్ కుంభకోణం వెలికి తీసింది కూడా పీఏసీనే.. 2G స్పెక్ట్రమ్ కూడా మనోహర్ జోషీ వెలికి తీశారు.. కామన్ వెల్త్ గేమ్స్ లో కుంభకోణాలు కూడా 2010లో PAC వెలికి తీసింది.. 1994లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకున్నా గీతారెడ్డికి PAC ఇచ్చారు.. 2019లో మేం PAC చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కి ఇచ్చాం.. అధికారంలో ఉండే వారికి ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది..? అని ప్రశ్నించారు.. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పక్షానికి పీఏసీ చైర్మన్‌ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం.. అందుకే PAC కమిటీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇక, ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version