Site icon NTV Telugu

YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్‌ ఆందోళన.. ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగి..!

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎక్స్ లో స్పందించిన ఆయన.. ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగ్ నివేదికలపై ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి.. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయని పేర్కొన్నారు జగన్‌..

Read Also: Nara Rohit Political Entry: పొలిటికల్‌ ఎంట్రీపై నారా రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. మనల్ని ఎవడ్రా ఆపేది..?

2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08 శాతం మాత్రమే పెరిగాయని తెలిపారు జగన్.. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04 శాతం పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయిందన్న ఆయన. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02 శాతం ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08 శాతం దగ్గరే ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు.. గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంన్న ఆయన.. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయిందన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39 శాతం మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే.. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది.. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56 శాతం చేశారని పేర్కొన్నారు.. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని హితవు చెప్పారు.. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలని సూచించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

Exit mobile version