Site icon NTV Telugu

YS Jagan: ఎక్స్‌లో జగన్‌ ఫైర్.. ప్రజలను పూర్తిగా మోసం చేశారు..!

Ysjagan

Ysjagan

YS Jagan: సోషల్‌ మీడియా వేదికగా ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత, పారదదర్శక పాలన ఆందించాం.. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తోంది.. రెడ్ బుక్ పాలనతో ప్రభుత్వాన్ని అస్తవ్యస్తంగా మార్చారు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధుడు చంద్రబాబు.. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టి మళ్లించటానికి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు..

Read Also: Realme GT 7: రియల్‌మీ జిటి 7 సిరీస్‌పై వేలల్లో డిస్కౌంట్.. మిస్ చేసుకోకండి

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్టు చేశారు.. చట్టానికి విరుద్దంగా రాజకీయ కక్షసాధింపునకు దిగారు.. టీవీ చర్చలో జరిగిన దానికి కొమ్మినేనిని బాధ్యులను చేయటం ఏంటి? అప్పటికీ ఆయన చర్చను పక్క దారి పట్టకుండా నియంత్రించారు.. కానీ, చంద్రబాబు ఒక కుట్రతో దాన్ని వక్రీకరించారని ఆరోపించారు జగన్‌.. ఒక పథకం ప్రకారం సాక్షి మీడియా కార్యాలయాలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులను ప్రోత్సాహించారు. మహిళల గౌరవాన్ని కాపాడతామని చెబుతూ వారితోనే దాడులు చేయించారు. రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలోనే 188 లైంగిక దాడులు, 15 హాత్యాచార సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు.. అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య చేసి డెడ్‌బాడీని అడవిలో పడేశారు.. మరోచోట 14 మంది టీడీపీ కార్యకర్తలు 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై ఆరు నెలల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె గర్భవతి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిర్లక్ష్యం వలన బాధితురాలి కుటుంబం రోడ్డున పడింది. మహిళలు, చిన్నారులను రక్షిస్తామన్న చంద్రబాబు వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.. పైగా ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షసాధింపునకు దిగటం చంద్రబాబుకే చెల్లింది అంటూ ఫైర్‌ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్..

Exit mobile version