YS Jagan: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్పందించిన జగన్.. సంచలన వ్యాఖ్యలు..
- రేషన్ బియ్యం అంశంపై స్పందించిన వైఎస్ జగన్..
- మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే..
- చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే .. పోర్టులో కస్టమ్స్ వాళ్లు, సిబ్బంది వాళ్లే..
- కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారన్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగుతూ వస్తోంది.. కొన్ని సార్లు మంత్రులు.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీయడం.. అధికారులు.. వ్యవస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, రేషన్ బియ్యం అంశంపై స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంలో మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే .. పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే.. కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు.. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారు.. కానీ, ఆ షిప్ దగ్గరకు మాత్రం వెళ్లలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు..
Read Also: ICC Mens Player Of The Month: బుమ్రాను కాదని.. పాకిస్తాన్ ఆటగాడికి అవార్డు
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఇక, బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అని పేర్కొన్నారు వైఎస్ జగన్.. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్‌గా ఉన్నాడన్నారు.. అసలు వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు? అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు.. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మన ప్రభుత్వం హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని, దాన్ని పక్కనపెట్టి.. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించామని గుర్తుచేశారు జగన్.. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం.. రేషన్ బియ్యం దుర్వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టింది మనమే.. కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్ని అప్పగించారని ఆరోపించారు.. సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదు.. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడంలేదు. దీనివల్ల మళ్లీ రేషన్ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!